మరోసారి మెగా ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి

saipallavi act as allu arjun new movie
- Advertisement -

saipallavi act as allu arjun new movie

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి, అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గ ఎదిగింది. తన మార్క్ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. కాగ ఇప్పుడు మరోసారి మెగా ఛాన్స్ వరించినట్టు తెలుస్తోంది.

బన్నీ సరసన మెరవనున్న సాయి పల్లవి..

చాలా గ్యాప్ తీసుకోని అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గ నటించబోతుంది అని సమాచారం. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కు వెళ్లనుంది. కాగా, ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడీగా నటించే హీరోయిన్‌ కోసం చేస్తున్న అన్వేషణ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. కైరా అద్వానీ, రష్మిక, సాయిపల్లవిల పేర్లు పరిశీలనలో ఉండడం తెలిసిందే.

ఈ ముగ్గురులో సాయిపల్లవికి బన్నీ సరసన నటించే అవకాశం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది కథ కాదు ఫేమ్‌ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా-సాయిపల్లవి జంటగా తెరకెక్కాల్సిన సినిమా సెట్స్‌కు వెళ్లడంతో ఆలశ్యం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో సాయిపల్లివి డేట్స్‌ అందుబాటులో ఉండడంతో త్రివిక్రమ్‌, బన్నీ కాంబినేషన్‌లో రూపొందే చిత్రంలో సాయి పల్లవి నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం.

చదవండి..సాహసమే: పోర్న్‌ స్టార్‌ పాత్రలో రమ్యకృష్ణ…!?

- Advertisement -