త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న నటి విద్యుల్లేఖ రామన్.. ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం!

actress-vidyullekha-raman-and-sanjay-engagement-still
- Advertisement -

చెన్నై: తెలుగు, తమిళ చిత్రాల్లో తన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న నటి విద్యుల్లేఖ రామన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. 

ఫిట్‌నెస్ నిపుణుడు, న్యూట్రిషనిస్ట్ సంజయ్‌తో కొంతకాలంగా ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల అంగీకారంతో ఇటీవల వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. 

ఈ విషయాన్ని నటి విద్యుల్లేఖ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వయంగా తెలియజేసింది. వారి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది. 

‘‘మేం రోకా చేసుకున్నాం. కరోనా నిబంధనలు పాటిస్తూ అతికొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆగస్టు 26న ఈ వేడుక జరిగింది..’’ అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపింది.  

తామంతా మాస్కులు ధరించామని, అయితే ఫొటోల కోసం వాటిని తీసి.. మళ్లీ వేసుకున్నామని.. తమకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొంది. 

విద్యుల్లేఖ నిశ్చితార్థం జరిగిన విషయం తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

‘అక్కా కంగ్రాట్స్’ అని వరుణ్ తేజ్ కామెంట్ చేయగా, రాశీఖన్నా ‘హే క్యూటీస్’ అని కామెంట్ చేసింది. ఇంకా నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్, తేజస్వి, ధన్య బాలకృష్ణన్, సాయితేజ్, రుహానీశర్మ తదితరులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -