మరో సంచలన బయోపిక్‌లో.. కీర్తీ సురేష్‌!?

- Advertisement -

అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్‌ నటించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన పోస్టర్స్‌, టీజర్‌లో అచ్చు సావిత్రిలాగే కలిపించారు కీర్తి. దీంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్‌ అయ్యింది. మహానటి తరువాత మరో క్రేజ్‌ బయోపిక్‌లో కీర్తీ సురేష్‌ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

మహానటిగా అద్భుత నటనతో ఆకట్టుకున్న కీర్తీ సురేష్‌ను పురుచ్చితలైవి జయలలిత పాత్రలో చూపించేందుకు తమిళ దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినీరంగంలోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన జయలలిత జీవితకథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా మంది ప్రయత్నించారు. అయితే ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా సెట్స్‌ మీదకు రాలేదు. తాజాగా మరోసారి జయలలిత బయోపిక్‌ వార్తలు తెర మీదకు వచ్చాయి.

కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రలో ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. అంతేకాదు కీర్తీ కూడా జయలలిత పాత్రలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై కీర్తీ సురేష్ నుంచిగాని, దర్శక నిర్మాతల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

- Advertisement -