మళ్లీ మొదటికి తమిళ అర్జున్ రెడ్డి! కారణం ఇదే!

tamil arjunreddy reshoot

Varma-reshout again

హైదరాబాద్: తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే విజయదేవరకొండ టాలీవుడ్ లో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా అవతరించాడు. ఆ తరువాత విజయ్ స్పీడ్ కి బ్రేకులువేసేవారే లేరు అని చెప్పాలి.

త్వరలోనే రీషూట్…

దీనితో విక్రమ్ తనయుడు ‘ధృవ్’ హీరోగా తమిళంలో ఈ సినిమాను ‘వర్మ’ టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. బాల దర్శకత్వంలో ‘ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్’ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా ఇటీవలే చిత్రీకరణను పూర్తిచేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాతలు తీసుకున్న సంచలన నిర్ణయం తో అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆశ్చర్యపోతున్నారు. సినిమా అవుట్ పుట్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన నిర్మాతలు, మళ్ళీ మొదటి నుంచి రీషూట్ చేయాలనే అభిప్రాయానికి వచ్చేశారు.

హీరో ‘ధృవ్’ ను మాత్రమే వుంచి, దర్శకుడితో పాటు మిగతా నటీనటులను, సాంకేతిక నిపుణులను మార్చేయాలనే నిర్ణయం తీసేసుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చేశారు. ఈ విషయమే ఇప్పుడు కోలీవుడ్ లో సంచలనంగా మారింది. చూడాలి మరి ఈ సినిమా విక్రమ్ తనయుడికి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో…

చదవండి : ‘యాత్ర’కి పోటీగా బరిలోకి దిగనున్న ఎన్టీఆర్ బయోపిక్!?