హైదరాబాద్: ఎస్‌ఎస్ రాజమౌళి ‘బాహుబలి’ సినిమాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘RRR’ వర్కింగ్ టైటిల్‌తో ఎస్‌ఎస్ రాజమౌళి ఈ సినిమాని త్వరలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారని తెలుస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అద్భుతంగా ఉంటుందని సమాచారం. దీని కోసం తాజాగా రాజమౌళిని కలిశానంటూ ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్ కూడా ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘‘RRR’లో తారక్ గురించి చర్చించేందుకు లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని కలిశాను.. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది..’’ అని స్టీవెన్స్ తన ట్విట్‌లో పేర్కొన్నారు.