చంద్రబాబు పన్నిన కుట్ర నుండి జగన్ ఎలా బయటపడబోతున్నాడో చూడండి!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎన్నికల ఫలితాలకు ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో ఎవరికి వారు విహార యాత్రల్లో సేద తీరుతున్నారు. ఇప్పటికే ఎన్నికలు ముగిసి పది రోజులు గడిచినా ఇంకా ఫలితాలకు నెల రోజుల సమయం ఉండడంతో పోటీ చేసిన అభ్యర్థులకు, బెట్టింగ్‌ రాయుళ్లకు క్షణం ఒక యుగంగా గడుస్తున్నట్టుగా ఉంది.

ఓటరు నాడి ఎవ్వరికి స్పష్టంగా అంతుచిక్కడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్నది ఎవరూ ఖచ్చితంగా అంచనాకు రాలేకపోతున్నారు. పైకి ఎవరికి వారు గెలుపు తమదే అని మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నా ఎవరికి వారికి ఆందోళన ఉండడం సహజం.

ఇక ఎవరి అంచనాలు ఎలా ఉన్నా పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏపీలో పలు ఏజెన్సీలు సైతం వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. మరికొందరు హోరాహోరీ పోరులో స్వల్ప ఎడ్జ్ వైసీపీకే ఉందని అంటున్నారు. వాస్తవంగా చూస్తే ఎన్నికల పర్వం ప్రారంభం కావడానికి ముందు వైసిపికి పూర్తిగా ఆధిక్యం ఉంది.

చదవండి:షాక్‌లో ‌చంద్రబాబు! పసుపు కుంకుమ ఎఫెక్ట్ టీడీపీకి తగలబోతుందా?

wగత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన 67 మంది ఎమ్మెల్యేలలో చంద్రబాబు 23 మందిని బలవంతంగా తమ పార్టీలోకి లాక్కున్న సంగతి తెలిసిందే. ఎంత విచిత్రం అంటే టీడీపీ నుంచి గెలిచిన వారికి కాకుండా వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించి టిడిపిలోకి వెళ్ళిన వారికి పెద్దపీట వేస్తూ మంత్రి పదవులు కట్టబెట్టారు.

రేపటి ఎన్నికల్లో టిడిపికి 10 నుంచి 15 సీట్లు తగ్గితే వైసీపీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలపై వలవేసి, వారికి పదవులు, డబ్బు ఎర చూపి వారిని తనవైపుకు తిప్పుకుని మళ్ళీ సీఎం పీఠం ఎక్కేందుకు చంద్రబాబు అప్పుడే కుట్ర రాజకీయాలకు తెర తీసేశారట. ఈ విషయం టీడీపీ వర్గాల ద్వారానే ఆ నోటా ఈ నోటా బయటకు వచ్చేసింది.

ఈ విషయాన్ని ఇప్పటికే పసిగట్టిన వైసీపీ వర్గాలు చాలా అయ్యాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను జగన్ ఇప్పటికే నియమించారు. వారంతా తమ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గెలిచే ఎమ్మెల్యేలు చేజారకుండా పక్కా ప్లానింగ్ తో రాజకీయం నడుపుతున్నారు.

ఎన్నికల రోజున కౌంటింగ్ అవగానే రిటర్నింగ్ అధికారి నుంచి సర్టిఫికెట్లు తీసుకొని వారంతా ఒకే చోటకు చేరేలా ఇప్పటికే వైసిపి స్కెచ్ వేసేసింది. ఏదేమైనా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇలా ఎన్నో అడ్డదారులు తొక్కుతుండడాన్ని ప్రజాస్వామ్య వాదులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

చదవండి: వైసీపీ గెలుపుని డిసైడ్ చేసేది అదొక్కటే! ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు!

 

- Advertisement -