చంద్రబాబు నిరుద్యోగ భృతి పై మరో సంచలన నిర్ణయం!

Chandrababu unemployment benefits decision News, AP Latest News, Newsxpressonline
- Advertisement -

ఆంధ్రప్రదేశ్: ఏపీలో ఎన్నికల వేల పార్టీల అధినేతలు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఓటర్లని ఆకర్శించేందుకు పలు హామీలు గుపిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం 18 నుంచి 35 ఏళ్ల వయసు వారికి నిరుద్యోగ భృతి ఇస్తున్నామని, భవిష్యత్ లో ఇంటర్ మీడియట్ నుంచే ఈ భృతి అందజేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, తాను ఏం పని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తానని, గర్భిణుల వైద్యం, మందుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, రైతులకు శాశ్వతంగా పెద్దన్నగా ఉంటానని, వ్యవసాయానికి భవిష్యత్తులో 12 గంటలపాటు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఏపీలో ఎక్కడ చూసినా చంద్రన్నే కులం, టీడీపీనే మతం అనేలా ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ఉన్న కేసీఆర్ డబ్బులు పంచాలని చూస్తున్నారని, ఆ పాపిష్టి డబ్బును తీసుకోవద్దని ప్రజలకు సూచించారు.

చదవండి: శుభవార్త! ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగులకూ అధిక పెన్షన్…

- Advertisement -