వైసీపీ రికార్డు: అతి చిన్న వయసులో ఎంపీ అయిన మాధవి…  

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ సూపర్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే . మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకి గాను వైసీపీ 151 చోట్ల గెలిచింది. అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లో 22 సీట్లని గెలుచుకుంది.

అయితే చాలామంది ఎంపీలు భారీ మెజారిటీతో గెలిచారు. వీరిలో వైసీపీ తరుపున అరకు నుంచి పోటీ చేసిన గోడ్డేటి మాధవి భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా…అతి చిన్న వయసులో ఎంపీగా అయ్యి రికార్డు సృష్టించింది.

కేవలం 25 ఏళ్ల 3 నెలల వయసుకే ఎంపీగా ఎన్నికై లోక్‌సభ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కురాలుగా రికార్డుకెక్కారు. అయితే ఇంతకు ముందు ఈ రికార్డు 2014 ఎన్నికల్లో హర్యానా రాష్ట్రం హిసార్‌ లోక్‌సభ స్థానం నుంచి జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) తరపున గెలుపొందిన దుష్యంత్‌ చౌతాలా పేరున ఉండేది.

ఈయన ఎంపీగా గెలిచే సమయానికి వయసు 26 ఏళ్ల 13 రోజులు. ఇప్పుడు గొడ్డేటి మాధవి ఈ రికార్డును చెరిపేశారు.

కిషోర్ చంద్రదేవ్‌ని మట్టికరిపించిన మాధవి…

ఇక అతి చిన్న వయసులో ఎంపీగా గెలవడమే కాకుండా….రాజకీయాలో తలపండిన మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్‌ని ఓడించారు. దాదాపు 2.25 లక్షల ఓట్ల తేడాతో అరకులో మాధవి గెలుపొందారు. అయితే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఆరు నెలల క్రితం జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా  వైసీపీలో చేరిన మాధవి.. అరంగ్రేటంలోనే రికార్డు విజయం సాధించింది.

చదవండి: వైసీపీ వేవ్‌లోనూ సత్తా చాటిన ఎర్రన్న ఫ్యామిలీ…

- Advertisement -