మరోసారి బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్న మెగా, నందమూరి వారసులు! ఈసారి విజయం ఎవరిదో? 

5:58 pm, Thu, 7 February 19
118 movie ,ABCD movie
118 movie ,ABCD movie
టాలీవుడ్‌లో వారసత్వ హీరోలు ఎక్కువ అనేది అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి   ఇప్పటికే పదిమందికి పైగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే నందమూరి వంశం నుండి కూడా చాలామందే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఎంతమంది సినీ ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యారో కాసేపు పక్కన పెడితే, అప్పటినుండి, ఎప్పటికివరకు మెగా, నందమూరి వార్ అలానే కొనసాగుతూ వస్తుంది.
ఈ రెండు ఫ్యామిలీల హీరోల నుండి సినిమా వస్తుంది అంటేనే అభిమానులకు ఊగిపోతారు. ఇక మెగా, నందమూరి హీరోల సినిమాలు ఒకే రోజు బాక్స్ ఆఫీస్ వద్ద బరిలోకి దిగితే ఆ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. మా హీరో గొప్ప అంటే మాహీరో గొప్ప అంటూ అభిమానులు కొట్టుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి.కాగ ప్రస్తుతం ఆ పరిస్థితులలో కొంత మార్పు వచ్చింది అని తెలుస్తోంది.
తాజాగా మళ్ళీ మెగా, నందమూరి వారసులు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, అల్లు శిరీష్. వరుస ఫ్లాపులతో ఉన్న కళ్యాణ్ రామ్, తన ఆశలన్నీ థ్రిల్లర్ మూవీ ‘118’ మీదే పెట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కె.వి.గుహన్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 25కే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆలస్యమైంది. ఈ చిత్రాన్ని మార్చి 1న రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే చెప్పారు.
మరోవైపు ఇంతకుముందు ఫిబ్రవరి 8కి షెడ్యూల్ అయిన అల్లు శిరీష్ సినిమా ‘ఏబీసీడీ’ సైతం వాయిదాపడింది. మార్చి 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు కొత్త పోస్టర్ వదిలారు. మలయాళ హిట్ మూవీ ‘ఏబీసీడీ’కిది రీమేక్. సంజీవ్ రెడ్డి అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. తెలుగులో నాలుగు సినిమాలు చేసి ఒకటే హిట్టు కొట్టిన శిరీష్‌కు కూడా ఈ సినిమా చాలా కీలకం. మరి ఈ మెగా, నందమూరి పోటీలో నిలబడి గట్టెకేదెవరో తెలియాలి అంటే మర్చి 1వరకు  వేచి చూడక తప్పదు