రాజమౌళి మల్టీ స్టార్స్ తో సినిమా తీయటానికి కారణం ఇదేనా?!

rajamouli
- Advertisement -

హైదరాబాద్: తెలుగు ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. హీరో ఎవరైనా సరే,సినిమా తీసి అదిరిపోయే హిట్ ఇవ్వడం జక్కన్న స్పెషాలిటీ. అందుకే ఈగ సినిమా తీసినా, కమెడియన్ సునీల్ తో మర్యాద రామన్న మూవీ తీసిన హిట్ కొట్టాడు.

ఇక బాహుబలి మూవీతో వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా స్టామినా ఏమిటో చూపించాడు. కలెక్షన్స్ వర్షం సాధించి ,అవార్డులు గెలుగుచుకున్న బాహౌబలి మూవీ తర్వాత తీసే సినిమా రేంజ్ ని కూడా ఆడియన్స్ ఎక్కువగానే ఊహించుకుంటారు.

అయితే ఆడియన్స్ నాడిని ముందుగానే పసిగట్టి అందుకనుగుణంగా ఆడియన్స్ ని తమ వైపునకు తిప్పుకుంటూ హైప్ క్రియేట్ చేయడం రాజమౌళి మార్క్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. అందుకే మగధీర తర్వాత అంతకు మించిన మూవీని ఆడియన్స్ ఆశిస్తారు.

అయితే సునీల్ తో లో బడ్జెట్ లో మర్యాద రామన్న తీసి అంచనాలను మళ్ళించాడు. ఇక బాహుబలి తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ చేస్తున్నాడు.

తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మల్టీస్టారర్ చిత్రాల సంఖ్యా పెరిగింది. కానీ ఓ స్టార్, ఓ యంగ్ హీరో కలిపి మల్టీస్టారర్స్ వస్తున్నాయి కానీ, రాజమౌళి తీసే మల్టీస్టారర్ మూవీ ఇద్దరు యంగ్ అగ్రహీరోలతో కావడం, ఇద్దరికి ఇద్దరూ క్రేజీ స్టార్స్ కావడం వలన భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో జక్కన్న తీస్తున్నాడు.

- Advertisement -