తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో విడుదల కానున్న ‘అవెంజర్స్: ఎండ్ గేమ్‌’!

Avengers-Title-Endgame, newsxpress.online
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ సినిమా ‘అవెంజర్స్: ఎండ్ గేమ్‌’. ఏప్రిల్ 26న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులలో సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500కు పైగా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

చదవండి: జేమ్స్ కేమరాన్ డబుల్ ధమాకా.. ‘అవతార్’కు మించిన రీతిలో సీక్వెల్స్.. 2020 డిసెంబర్‌లో విడుదల!?

హాలీవుడ్‌లో రూపొందించిన ఓ చిత్రాన్ని తెలుగు భాషలోకి డబ్ చేసి ఇంతటి భారీ స్థాయిలో.. అత్యధిక థియేటర్లలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం ఇదే తొలిసారి. ఆంటోని రుస్సో, జాయ్ రుస్సో దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మించింది.

ఆరుగురు సూపర్ హీరోల సాహస గాథ…

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ డౌనీ జూనియర్ నటిస్తున్న ఈ చిత్రంలో క్రిస్‌ ఇవాన్స్‌, మార్క్ రఫాలో, క్రిస్ హేమ్స్ వర్త్, స్కార్లెట్ జాన్సన్ వంటి స్టార్స్ నటించారు. 2012లో అవెంజర్స్ సినిమా విడుదలైంది.

ఇది ఆరుగురు సూపర్ హీరోల సాహస గాథ. వారిలో ప్రతి ఒక్కరు అద్భుతమైన బలం కలిగి ఉంటారు. ఆ హీరోలు పేర్లు ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ విడో, థోర్, కెప్టెన్ అమెరికా మరియు ఏజెంట్ బార్టన్.

చదవండి: హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌పై పబ్లిక్‌గా చెయ్యేసిన డైరెక్టర్.. షాక్ తిన్న హీరోయిన్!

అవెంజర్స్ సిరీస్‌లో వచ్చిన చిత్రాలన్నీ అద్బుత విజయం సాధించాయి. చివరిగా ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’ అనే పేరుతో చిత్రం విడుదలైంది. ఇందులో పలు సందేహాలని మిగిల్చిన మేకర్స్.. వాటిని తాజా చిత్రం ‘అవెంజర్స్: ఎండ్ గేమ్‌’లో తీర్చనున్నారు.

థానోస్‌ శక్తితో కనిపించకుండాపోయిన అవెంజర్స్‌ మళ్లీ తిరిగి ఎలా వచ్చారు? థానోస్‌ను ఎలా అంతం చేశారన్నదే ఈ చిత్ర కథ. థానోస్‌ పాత్రకి తెలుగులో రానా డబ్బింగ్ చెప్పిన విషయం విదితమే . ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ కోసం డబుల్ ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ స్పెషల్‌గా ఓ పాట కూడా రూపొందించగా, ఇది ఇప్పటికే విశేష ఆదరణ పొందింది.

చదవండి: హర్రర్ సినిమాలకు ఓ ‘స్క్రీన్ ప్లే లెసన్’.. ఈ సినిమా!
- Advertisement -