వ్యవసాయం చేసుకుంటా.. పెరోల్ ఇవ్వండి: జైలు అధికారులకు డేరాబాబా రిక్వెస్ట్!

gurmeet-ram-rahim-behind-bars
- Advertisement -

చండీగఢ్: డేరాబాబా గుర్తున్నాడు కదా? అదేనండీ.. తన ఆశ్రమమైన డేరా సచ్ఛా సౌదాలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం, హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్. ఈయనగారు చాలారోజుల తరువాత ఇటీవల మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.

విషయం ఏమిటంటే.. తాను వ్యవసాయం చేసుకుంటానని, అందుకు వీలుగా తనకు పెరోల్ ఇప్పించాలంటూ డేరాబాబా ఈ మధ్య జైలు అధికారులకు దరఖాస్తు చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు సిర్సాలోని జైలులో ఉన్నాడు.

‘‘పెరోల్‌కు అర్హుడినే..’’

అయితే తాను చేసినవి మరీ క్షమించరాని నేరాలేం కాదని, పైగా జైలులో తన ప్రవర్తన కూడా సంతృప్తికరంగానే ఉందని, కాబట్టి తాను పెరోల్‌కు అర్హుడినేనంటూ ఆ దరఖాస్తులో పేర్కొన్నాడు. సిర్సా జైలు అధికారులు ప్రస్తుతం ఇతడి దరఖాస్తును పరిశీలిస్తున్నారు.

ఒకవేళ అతడి దరఖాస్తును మన్నించి పెరోల్ గనుక ఇస్తే.. కొంతకాలమైనా బయటికొచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలనేది గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కోరికగా కనిపిస్తోంది. దీనికి అతడు వ్యవసాయం అనే ముసుగు వేసినట్లుగా అర్థమవుతోంది.. కదూ?

- Advertisement -