పాత కక్షలను.. కొత్తగా చూపించిన…‘అరవింద సమేత వీర రాఘవ’.. రూ.100 కోట్ల క్లబ్‌లో..

6:05 pm, Sun, 14 October 18
aravinda-sametha

aravinda-sametha-ntr-puja-hegde

అరవింద సమేత వీర రాఘవ..    గత నాలుగు రోజులుగా వినిపిస్తున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, స్టార్ విలన్ జగపతిబాబు, స్టార్ కమేడియన్ సునీల్.. ఇంతమంది కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమాను చక్కగా వండి ప్రేక్షకులకు వడ్డించారు. ఇంత మంచి రుచికరమైన భోజనం  ఈ మధ్య కాలంలో దొరకలేదని.. ప్రేక్షకులు శభాష్ అన్నారు. అయితే చాలామంది మాత్రం.. భోజనంలో  సీమకారం, సీమఘాటు ఎక్కువయ్యాయని కామెంట్లు చేశారు.

సోషల్ మీడియాలో ఒక అనంతపురం వాసి సీమవాసులను ఇంత కర్కశంగా ఎలా చూపిస్తారని ఆవేదన పూరిత లేఖ రాశాడు. అందులో సీమలో నాలుగు జిల్లాల్లో ఎంతోమంది గొప్పవాళ్లు, ప్రముఖులు ఉన్నారని..  వాళ్లను వదిలేసి.. ఇదేం హింసాత్మక గోలరా బాబు అని నెత్తి కొట్టుకుంటున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్లు.. మంచి పంచ్ డైలాగ్ లు, ఆరోగ్యకరమైన హాస్యం, ఇంటిళ్లపాదీ చూసి చక్కగా మనసారా నవ్వుకునే సినిమాలకు మాటలు రాసి, తీసిన  త్రివిక్రమేనా.. ఇటువంటి కరడుగట్టిన హింసాత్మకమైన సినిమా తీసినదని  ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆనాటి  త్రివిక్రమ్ ఎక్కడా? అప్పటి మాటల మాంత్రికుడి చేతిలో మంత్ర దండం.. సీమకత్తిలా మారిపోయిందేమిటని గోల పెడుతున్నారు. ఒక హిట్టుకోసం.. హీరోకి నచ్చిన కథ కోసం.. అంత మసాలాలు దట్టించి తీయడమేమిటని? ప్రశ్నిస్తున్నారు.

ఒక నువ్వు నాకు నచ్చావు,  ఒక మల్లీశ్వరి, ఒక నువ్వే కావాలి లాంటి నవ్వుకోవడానికి వీల్లేక, నవ్వలేక చచ్చేవాళ్లు..కడుపు ఉబ్బితబ్బిబ్బు అయిపోయి థియేటరంతా నవ్వుల పూవులు, ఆ తర్వాత కొంత ట్రెండు మార్చుకొని  అతడు, జులాయి, అత్తరాంటికి దారేది?  లాంటి సినిమాలు తీసి..తన మార్కు పోకుండా కాపాడుకున్నాడు.. కానీ ఈసారేంటి? మొత్తం ఏకంగా యూటర్న్ తీసుకోవడంపై ఆయనను నిజంగా అభిమానించే వాళ్లు.. సిన్సియర్ గా బాధపడుతున్నారు.

ఒక హిట్టు కోసం..ఏదో తపన పడి ఉండవచ్చు..హిట్టయిందని ఇదే మూస ధోరణిలో వెళితే..త్రివిక్రమ్ కు.. కొత్తగా  హిట్టులు రావచ్చునేమోగానీ.. ఆనాటి పేరు మాత్రం రాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ అందరిలాగే ఒక జ్జాపకంగా మిగిలిపోతాడు. ఒకప్పుడు రా… చూస్తే చూడాలి.. త్రివిక్రమ్ సినిమాలు.. ఇప్నుడంత లేదు అనుకుంటారు..

aravinda-sametha-ntr-trivikrఇక సినిమా గురించి రాయాలంటే…

సీమలో అంతరించిపోయాయని చెబుతున్న పాత కక్షలను మళ్లీ కొత్తగా తీసి.. హింసను ఒక పతాకస్థాయిలో చూపించారనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇందులో కొన్ని సన్నివేశాలు గత సినిమాలు పోలి ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. అందులో ముఖ్యమైనవి..

అత్తారింటికి దారేది? సినిమాలో హీరో   ఒక డ్రైవర్ గా.. సొంత అత్తింటిలో నటిస్తారు.  అరవింద సినిమాలో.. హీరోయిన్ దగ్గర కూడా ఒక డ్రైవర్ గా పనిచేస్తారు.

కమేడియన్ సునీల్ గెటప్, క్యారెక్టరైజేషన్.. అచ్చు.. ‘అతడు’ సినిమాలో మహేష్ బాబు పక్కనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.  ‘అరవింద సమేత’ సినిమాలో.. కూడా హీరో పక్కన సేమ్ అదే థీమ్ లో డైలాగులు చెప్పడం, హీరో అన్నీ నిజాలే సునీల్ కి చెప్పడం జరుగుతుంది.

అ ఆ సినిమాలో లొకేషన్లను, ఇంకా ఈ మధ్య సూపర్ హిట్ అయిన సినిమాల్లో ప్రాంతాలను ఏరియల్ వ్యూలో వాడుకున్నట్టుగా ఉంది..   అరవింద సినిమాలో వరుసగా 5 సుమోలతో హీరో వెళుతంటే  ఆ లొకేషన్లన్నీ ఎక్కడో చూసినట్టుగానే కనిపించాయి. ఇంకా రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల్లో ఆసుపత్రి  సన్నివేశాలు పాతగా కనిపించాయి.   నెటిజన్లు మాత్రం రంగస్థలం ఛాయలు ఉన్నాయనే గట్టిగానే తమ వాణి వినిపించారు..

ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రారంభంలోనే  హీరో తండ్రిని చంపేస్తారు. వారిపై పగ తీర్చుకోకుండా వారినెలా దెబ్బకొట్టాడనేదే సినిమా..

ఇలా  ఎవరెన్ని అన్నా.. సినిమా మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్ల క్లబ్ లో చేర్చింది. డబ్బులు వచ్చాయి. సినిమాలు తీసేది డబ్బుల కోసమే.. ఆదర్శాల కోసం కాదు.. మొత్తానికి హీరోని, డెరెక్టర్ ని లైమ్ లైట్ లో నిలబెట్టింది.  చివరికి కొసమెరుపు ఏమిటంటే.. సినిమా సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ  ఈ సినిమాలో ఒక్క ఫైట్ లేదు.. హింస లేదని చెప్పడం.. ఒక యుద్ధం తర్వాత జరిగే సన్నివేశాలతో సినిమా తీశా..అని చెప్పుకొచ్చారు.

aravinda-samethaజూనియర్  ఎన్టీఆర్ లో బ్రహ్మండమైన నటుడున్నాడు.. పిండుకున్నవాళ్లకి పిండుకున్నంత.. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఈజ్ తో చేస్తాడు.. అదుర్స్ లో చారి పాత్ర వేసినా.. అరవిందలో వీరరాఘవ పాత్ర వేసినా.. టెంపర్ లో  పోలీస్ పాత్ర అయినా.. అన్నీ డిఫరెంట్ షేడ్స్ ఉన్నవి.. బాగుంది.. చాలా బాగా చేశాడు.. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆ సీరియస్‌నెస్ మెయింటినెన్స్.. షోలే సినిమాలో అమితాబ్ ని చూసినట్టే ఉంది.

అయితే పాటలు..కూడా ఎందుకు రిస్క్ అనుకుంటూ సంప్రదాయ దంపుడు బాణీల్లాగే సాగిపోయాయి. ఇందులోనైనా కొత్తదనం చూపించాల్సి ఉంది…మొత్తానికి సునీల్ మళ్లీ తెరమీదకు నవ్వులు పండించడానికి వచ్చాడు.. మళ్లీ ప్రేక్షకులకు మంచి రిలీఫ్..అంత కష్టపడి సినిమా తీస్తారు.. అందరికీ అభినందనలు..

చివరిగా  ఒక్కమాట.. ఈ సినిమా రివ్యూ.. రిపోర్టర్ సొంత అభిప్రాయంగానే భావించాలి.

  • – శ్రీనివాస్ మిర్తిపాటి