ఓవర్సీస్‌లో దూసుకుపోతున్న‘మహానటి’

9:31 am, Sun, 13 May 18

తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన  ‘మహనటి సావిత్రి’ జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినిమా ‘మహనటి’.  ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా,  ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. ‘మహనటి’ సిినిమాను ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా తెరకెక్కించారు. సావిత్రి పాత్రలో నటి కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం విడుదలైన ఈ సినిమా ఓవర్సిస్‌లో మాత్రం మంగళవారమే విడుదలైంది.

ఈ సినిమా కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సిస్‌లోనూ మహానటి సినిమా దూసుకుపోతుంది. ఓవర్సిస్‌లో అగ్ర హీరోల సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా పోటీ పడి మరీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. సాధారణంగా ఓవర్సిస్‌లో వీకెండ్, హలీడేస్‌లో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు. అలాంటిది మహనటి సినిమా మంగళవారం (నాన్ హలీడే) రోజున రిలీజ్ అయి కూడా కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది. మంగళవారం 139 లోకేషన్లల్లో ప్రివ్యూల ద్వారా రెండు లక్షల తోంభై ఏడు వేల తోమ్మిది వందల తోంభై ఏడు డాలర్లు రాబట్టింది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మౌత్ టాక్‌తో ఈ సినిమా కలెక్షన్లు అంతకంతకు పెరుగుతున్నాయన్నారు.

బుధవారం కూడా ఈ సినిమా 142 లోకేషన్లల్లో లక్ష తోంబై రెండు వేల రెండు వందల పధ్నాలుగు డాలర్లు రాబట్టింది. గురువారం నాటికి లక్ష ముప్ఫై తోమ్మిది వేల నూట యాబై ఒక్క డాలర్ల కలెక్షన్లు రాబట్టి మొత్తంగా ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఆరవై రెండు డాలర్లు కొల్లగొట్టింది.. మహానటి సినిమాకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుండటం, కలెక్షన్లు ఏ మాత్రం తగ్గకపోవడం చూస్తుంటే ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం పెద్ద కష్టమైన పనేమి కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.