‘కేజీఎఫ్’ మరో రికార్డు! పాకిస్తాన్‌లోనూ దుమ్ము దుమ్ము.., హిందీ డబ్బింగ్ సినిమాల్లో…

1:42 pm, Sat, 19 January 19
kgf - first kannada movie in hindi

ఇస్లామాబాద్: విడుదలైన అన్ని భాషల్లోనూ కనకవర్షం కురిపిస్తున్న ‘కేజీఎఫ్’ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. తాజాగా పాకిస్తాన్‌లో విడుదలైన తొలి కన్నడ సినిమాగా రికార్డులకెక్కింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను లాహోర్, ఇస్లామాబాద్‌లలోని మల్టిప్లెక్స్‌లలో జనవరి 10న విడుదల చేశారు. ఆశ్చర్యం.. అక్కడ కూడా ఈ సినిమా దుమ్ములేపుతోంది.

‘కేజీఎఫ్’.. కన్నడ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో నిర్మితమైన సినిమా. దేశవ్యాప్తంగా 2400 థియేటర్లలో ఈ సినిమా విడుదలకాగా.. రూ.200 కోట్లపైబడి వసూళ్లు సాధించింది. అటు ఓవర్సీస్‌లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. ఇక బాలీవుడ్ విషయానికొస్తే.. హిందీ డబ్బింగ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో చిత్రంగా ‘కేజీఎఫ్’ నిలిచింది.

రెండో భాగం ఫిబ్రవరిలో…

ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ యశ్ హీరోగా నటించగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ‘కేజీఎఫ్’ సినిమా మొత్తం రెండు భాగాలు. డిసెంబర్‌లో తొలి భాగం విడుదల అవగా.. రెండో భాగాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో యశ్ ఇటు దక్షిణాదిలోనే కాక.. అటు ఉత్తరాదిలోనూ క్రేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.

కన్నడ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమా ‘కేజీఎఫ్’. దేశవ్యాప్తంగా 2400 థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వగా.. 200 కోట్ల రూపాయల పైబడి వసూళ్లు రాబట్టింది. ఓవర్సిస్‌లోనూ ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. హిందీ డబ్బింగ్ సినిమాల్లో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన నాలుగో చిత్రంగా ‘కేజీయఫ్’ నిలిచింది.

సంబంధిత వార్తలు

గ్రేట్: రూ.200 కోట్ల క్లబ్‌లో ‘కేజీఫ్’! కోలీవుడ్‌లోనే తొలిసారిగా, ఓవర్సీస్‌లోనూ రికార్డు కలెక్షన్లు…