ఐశ్వర్యరాయ్‌పై వివేక్ ఒబెరాయ్ సెటైరికల్ ట్వీట్.. మండిపడుతున్న మహిళా కమిషన్…

8:07 am, Tue, 21 May 19

ముంబై: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌పై సెటైరికల్ ట్వీట్ చేసి వివేక్ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పెట్టిన ఓ పోస్ట్‌ను నటుడు వివేక్ ఒబెరాయ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

అయితే గతంలో ఐశ్వర్య.. సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్‌లతో డేటింగ్ చేసింది. ఆ తరువాత అభిషేక్‌ని పెళ్లి చేసుకొని కూతుర్ని కూడా కన్నది. ఇక దీన్ని ఎన్నికల ఫలితాలకు లింక్ చేస్తూ ఓ వ్యక్తి పోస్ట్ తయారు చేశారు.

చదవండి:  ఆసక్తికరం: ఒకేరోజు ప్రభుదేవా-తమన్నా జంటగా నటించిన రెండు సినిమాలు విడుదల…
ఐశ్వర్య, సల్మాన్‌లను ఉద్దేశిస్తూ ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-వివేక్‌లను ఉద్దేశిస్తూ ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ అసలు ఫలితం అని రాశారు.

దీన్నే వివేక్ ట్వీట్ చేశారు. ఆ ఫోటో కింద క్యాప్షన్‌గా ‘హహహ.. క్రియేటివ్‌.. ఇక్కడ రాజకీయాలు లేవు. జీవితం మాత్రమే’ అని రాసుకొచ్చాడు. అయితే వివేక్ ట్వీట్‌పై ఇప్పుడు దుమారం చెలరేగుతుంది. సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు, నెటిజన్లు వివేక్‌పై మండిపడుతున్నారు.

నటి సోనమ్‌ కపూర్‌, క్రీడాకారిణి గుత్తా జ్వాలతోపాటు వివేక్‌పై విరుచుకుపడ్డారు. ఓ నటుడు అయి ఉండీ మరో నటిని కించపరిచేలా ఈ పోస్టులు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక్ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ అతడికి నోటీసులు జారీ చేసింది.

చదవండి ఆర్ ఆర్ ఆర్ బాహుబలిని దాటుతుందా?