బ్రతికుంటే ఇంటికిరా.. నేనే కాల్చేస్తా: స్టార్ హీరోపై భార్య ఆగ్రహం!

2:10 pm, Wed, 6 March 19
1
twinkile khanna fires on akshaykumar

బాలీవుడ్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన ఓ భయంకరమైన స్టంట్ పట్ల ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా మండిపడ్డారు. బ్రతికుంటే ఇంటికిరా నిన్ను నేనే చంపేస్తా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు విషయం ఏమిటంటే… ప్రస్తుతం అక్షయ్ దిఎండ్ అనే వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు.

ట్వింకిల్ ఖన్నా ఫైర్ …

అక్షయ్ నటించబోయే తొలి వెబ్ సిరీస్ కావడంతో దీన్ని గ్రాండ్ గా ప్రకటించాలని అనుకున్నారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ఒంటికి నిప్పంటించుకొని స్టేజ్ పై నడిచారు. ఏ హీరో చేయని స్టంట్ అక్షయ్ కుమార్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

కానీ ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అక్షయ్ కుమార్ భార్య ఏకంగా అతడికి వార్నింగ్ ఇచ్చింది. ‘నీ ఒంటికి నువ్వే నిప్పంటించుకున్నావ్. దీని తరువాత కూడా నువ్ బతికే ఉంటే ఇంటికి రా.. నిన్ను నేను చంపేస్తాను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

దీనికి అక్షయ్ బదులిస్తూ.. ‘‘ఇప్పుడు నాకు ఈ విషయంలో భయంగా ఉంది..” అని ట్వీట్ చేస్తూ.. ‘దేవుడానన్ను కాపాడు’ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.

ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికొస్తే తన కొడుకు ఆరవ్ సూచన మేరకు ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు అక్షయ్ వెల్లడించారు. దీంతో పాటు ‘కేసరి’, ‘సూర్యవంశి’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు అక్షయ్. అలాగే అక్షయ్ ఈ మద్యే రోబోలో నెగెటివ్ రోల్ లో అందరిని మెప్పించిన విషయం తెలిసిందే.

చదవండి: వెండితెరపై రియల్ హీరో అభినందన్ వర్ధమాన్ సాహసకృత్యం! హీరో పాత్ర‌కు జాన్ అబ్రహాం?