వైరలవుతోన్న అమీర్ ఖాన్ ఎకానమీ క్లాస్‌ టూర్‌!

5:05 pm, Tue, 23 April 19
Ameer khan Latest News, Bollywood Latest News, Newsxpressonline

ముంబై: ఓ టాప్‌ హీరో సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తే, అబ్బో ఊహించడానికే కష్టం. కానీ దీన్ని నిజం చేసి చూపారు బాలీవుడ్‌‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌.

తాజాగా ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి తోటి ప్రయాణికులకు షాక్ ఇచ్చాడు అమీర్ ఖాన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలు విషయానికొస్తే… భారతీయ వైమానిక రంగాన్ని జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం వెంటాడుతోంది. జెట్ ఎయిర్ వేస్ విమానాల రద్దు కారణంగా ప్రయాణికుల డిమాండ్ పెరగడంతో సీట్ల కొరత ఏర్పడింది. దాంతో విధిలేక ప్రముఖులు సైతం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సిన అగత్యం ఏర్పడింది.

అమీర్ ఖాన్ ప్రయాణం తప్పనిసరి కావడంతో చివరి నిమిషంలో ఆయన ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సి వచ్చింది. విమానంలోకి అమీర్ ఎక్కగానే తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. సెల్ఫీలతో హడలెత్తించారట.

దీన్ని కాస్తా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో, ఆ వీడియో ఇప్పుడు వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమీర్‌ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ఆమీర్‌ భాయ్‌.. నువ్వు రియల్‌ హీరోవి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.