హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న తార.. ‘ఎగ్జిబిట్’ కోసం రెచ్చిపోయిన నటి

1:23 pm, Tue, 10 September 19

ముంబై: హీరోయిన్లు నిత్యం వార్తల్లో ఉండలాంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి. ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీలకు హాట్ హాట్ పోజులు ఇస్తుండాలి. అలా ఉంటేనే ప్రత్యేకంగా కనిపిస్తారు.

అందరి అందరిలోనూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే ఇవన్నీ తప్పనిసరి. ఈ విషయం టాలీవుడ్ హీరోయిన్ల కంటే కూడా బాలీవుడ్ హీరోయిన్లకు ఇంకా బాగా తెలుసు.

బాలీవుడ్‌లో అడుగుపెట్టిన వెంటనే సోషల్ మీడియాలో తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి మొదట ప్రధాన్యం ఇస్తారు. ఇలా అడుగుపెట్టి సోషల్ మీడియాలో దూకుడును ప్రదర్శిస్తున్న హీరోయిన్లలో ఒకరు తారా సుతారియా.

కరణ్ జోహార్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. ఒక్క సినిమాతోనే ఆకట్టుకుంది. ఫోటో షూట్లు మొదలెట్టింది. తాజాగా ఎగ్జిబిట్ అనే మ్యాగజైన్‌కు పోజులిచ్చింది.

శిరోజాలతో పాటు హాట్ హాట్ అందాలను అలా గాల్లో వదిలేసి వయ్యారంగా కూర్చొని సెప్టెంబర్ కవర్ పేజీపైకి ఎక్కింది. అసలే లేటెస్ట్ హీరోయిన్, పైగా హాట్ పోజులు. ఇంకేముంది అందాల ఎగ్జిబిషన్‌తో ఎగ్జిబిట్ సేల్స్ టాప్ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి.