శ్రీదేవిపై తన ప్రేమని చాటుకున్న స్టార్ హీరో అజిత్! ఏం చేశాడో తెలుసా?

1:00 pm, Wed, 30 January 19
sridevi producing to ajith

భారతీయ సినీ చరిత్రలో లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగిన అందాలతార , దివికేగిన ధృవ తార శ్రీదేవి చిరకాల కోరికని ఇప్పుడు తన భర్త బోనికపూర్ తీర్చబోతున్నాడు . ఇంతకీ శ్రీదేవి చిరకాల కోరిక ఏంటి అని ఆలోచిస్తున్నారా?  తమిళ సినీ ఇండస్ట్రీ‌కి చెందిన స్టార్ హీరో అజిత్‌తో తమిళ్‌లో సినిమా నిర్మించాలనేది ఆమె చిరకాల కోరిక . కానీ ఆ కోరిక తీరకమునుపే ఆమె మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోయింది.

ఇకపోతే తమిళనాడులో అజిత్‌కి ఉన్న క్రేజే వేరు అని చెప్పాలి . అలాగే అజిత్‌కి శ్రీదేవి అంటే చాలా ఇష్టం, తనకి బాగా ఇష్టమైన నటి కూడా . ఈ ఇష్టం కారణంగానే అజిత్‌ని శ్రీదేవి అడగ్గానే తన రీఎంట్రీ చిత్రమైన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాడు.

బోనీ కపూర్  నిర్మాణంలో అజిత్ సినిమా…

కాగా ప్రస్తుతం తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. బోనీ కపూర్  నిర్మాణంలో అజిత్ ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో అజిత్ నటించడానికి గల ముఖ్యకారణం శ్రీదేవే అని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై బోనీకపూర్ మాట్లాడుతూ.. ” హిందీలో వచ్చిన పింక్ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నాను. ఈ సినిమాలో విద్యాబాలన్ , శ్రద్ధా శ్రీనాథ్ లు ముఖ్యమైన పాత్రలను చేస్తున్నారు..” అని చెప్పారు.

ఇంకా …” తన మాతృభాష తమిళంలో అజిత్ హీరోగా ఒక సినిమాను నిర్మించాలనేది శ్రీదేవి కల. తరచూ ఆమె నాతో ఈ మాట అంటూ ఉండేది. ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా షూటింగ్ సమయంలో ఇదేమాట అజిత్‌తో ఆమె అంటే, తప్పకుండా చేస్తానని అప్పుడు ఆయన మాట ఇచ్చాడు. ఇప్పుడు ఈసినిమాకి ఆయన పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఇలా శ్రీదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు , శ్రీదేవి కలను నిజం చేస్తున్నాడు..” అని చెప్పుకొచ్చాడు.

చదవండి: మళ్లీ పెళ్లి చేసుకోనున్న రజినీ కుమార్తె సౌందర్య: ఎవరితో, ఎప్పుడంటే..?