సల్మాన్ సెటైర్: నేడు నా పెళ్లి గురించి ప్రకటిస్తా…!

8:11 am, Thu, 23 May 19

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతూ…. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న సల్మాన్ ఖాన్…నేడు తన పెళ్లి గురించి ప్రకటిస్తానని సంచలన విషయం చెప్పాడు. ఇప్పటికే ఐదు పదుల వయసు దాటిన సల్మాన్ ఖాన్..  తాను నటించిన ‘భరత్’ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్‌లో భాగంగా….సల్మాన్‌కి తన పెళ్లి గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ఈ సందర్బంగా సల్మాన్ మాట్లాడుతూ…. ‘నా పెళ్లి గురించి 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు (మే 23) ప్రకటిస్తా” అని ఆయన ఓ జోక్ చేశారు.

ఎన్నికల రిజల్ట్స్ కన్నా తన పెళ్లి గురించే ప్రజలకు ఆసక్తి ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతో సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బుధవారం ఆయన మరో సందర్భంలో మాట్లాడుతూ…. తనకు పిల్లలు కావాలే తప్ప, వారికి తల్లి వద్దన్నట్టుగా మాట్లాడటంతో, సరోగసీ ద్వారా బిడ్డలను కనాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

చదవండి: హీరో సూర్యకి ఊహించని షాక్ ఇచ్చిన సురేశ్ రైనా