రణబీర్, ఆలియా భట్ వెడ్డింగ్ కార్డ్ లీక్..పెళ్లి ఎప్పుడో తెలుసా?

11:40 am, Mon, 1 April 19

ముంబై: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అతని ప్రియురాలు హీరోయిన్ ఆలియా భట్ ల వెడ్డింగ్ కార్డు ఆన్ లైన్లో లీక్ అయింది. వీరిద్దరూ ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మే 11న వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. రాత్రి 8 గంటలకు వీరి వివాహ వేడుక జరగనుందని ఈ వెడ్డింగ్ కార్డులో కనిపిస్తోంది.

మే 11న పెళ్లి..

ఇటీవలే ఆలియా తల్లి, రణబీర్ తో తమ కుమార్తెకు ఎటువంటి రిలేషన్ లేదని, వారిద్దరూ మంచి స్నేహితులేనని చెప్పిన నేపథ్యంలో, వీరి పెళ్లి కార్డు బయటకు రావడం గమనార్హం. ఇప్పటికే కొంతమంది వెడ్డింగ్ ప్లానర్స్ తో ఈ జంట మాట్లాడిందని సమాచారం.

ఆలియా, రణబీర్ కపూర్ జంట వివాహం తరువాత ముంబైలో రిసెప్షన్ ఇచ్చి ఆపై హనీమూన్ నిమిత్తం గ్రీస్ లోని మైకూన్స్ కు వెళుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు రిషీ కపూర్, ఈ నెలలోనే ఇండియాకు తిరిగి వచ్చి వివాహ వేడుకల్లో పాల్గొంటారని తెలుస్తోంది. రణబీర్ సోదరి రిధిమా కపూర్ ఈ పెళ్లికి ఆభరణాలను స్వయంగా డిజైన్ చేస్తున్నారని సమాచారం.

aliya , ranbir wedding card newsxpress.online

చదవండి:  దూసుకెళ్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ఫుల్ హ్యాపీ