హాలీవుడ్ రీమేక్ లో మిస్టర్ ఫర్ఫెక్ట్ !

2:43 pm, Sat, 9 March 19
3
Mr. Perfect in the Hollywood remake, Newsxpressonline

ముంబై: ఆమిర్ ఖాన్ కి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. సినిమా, సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ, అశేష ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆమిర్ ఖాన్ ఎంచుకున్న కథలు, విలక్షణమైన పాత్రలు, ఆ పాత్రల్లో ఆయన ఒదిగిపోయే తీరు ఆయన క్రేజ్ ను పెంచుతూ వెళ్లాయి.

విభిన్నమైన కథలు .. విలక్షణ పాత్రలు…

అలాంటి ఆమిర్ ఖాన్ త్వరలో ఒక హాలీవుడ్ రీమేక్ లో నటించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది .. ఆ సినిమాయే ‘ఫారెస్ట్ గంప్’. కొంతకాలం క్రితం వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ హాలీవుడ్ క్లాసిక్స్ లలో ఒకటిగా నిలిచిపోయింది.

టామ్ హాంక్స్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, 6 ఆస్కార్ పురస్కారాలను సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమా రీమేక్ హక్కులను ఆమిర్ ఖాన్ దక్కించుకున్నాడట. ఆమిర్ ఖాన్ చేయనున్న ఈ సినిమా గురించే ఇప్పుడు అంతా బాలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు.

చదవండి :బాహుబలి-3లో నటించాలని అనుకుంటున్న హాలీవుడ్ దిగ్గజం!