రాహుల్‌ గాంధీతో డేట్‌ కావాలంటున్న కరీనా! సైఫ్ ఏమంటాడో మరి…

1:09 pm, Sat, 2 March 19
Kareena-Rahul-Gandhi

ముంబై: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగి, స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది క‌రీనా క‌పూర్‌. ప్రస్తుతం వీరికి తైమూర్ అనే కొడుకు కూడా ఉన్నాడ‌నే సంగ‌తి అందరికి తెలిసిందే. వివాహ‌మై, ఒక బిడ్డకి తల్లి అయిన త‌ర్వాత కూడా క‌రీనా కపూర్ ప్రస్తుతం సినిమాల్లో న‌టిస్తూ బిజీగానే ఉంది.

రాహుల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలని…

తాజాగా సిమీ గ‌రేవాల్ నిర్వాహించిన ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న క‌రీనా కపూర్ త‌న జీవితంలోని ప‌లు ఆస‌క్తిక‌ర విశేషాల‌ను వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యాత అడిగిన ఓ ప్ర‌శ్న‌కు క‌రీనా అంతే ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పింది. మీరు ఎవ‌రితో డేట్‌కు వెళ్లాల‌నుకుంటున్నారు? అని సిమీ ప్ర‌శ్నించాడు.

ఈ ప్ర‌శ్న‌కు స్పందించిన క‌రీనా అక్కడ ఉన్నవారందరు షాక్ అయ్యేలా ఆన్సర్ చెప్పింది. ‘‘మీరు అడిగిన ప్ర‌శ్న‌కు ఈ స‌మాధానం చెప్పొచ్చో, చెప్ప‌కూడ‌దో తెలియదు. అయినా చెబుతాను. నా స‌మాధానం వివాదాస్ప‌దం అవుతుందేమో. నేను రాహుల్ గాంధీతో డేట్‌కు వెళ్లాల‌నుకుంటున్నాను..’’ అని ఎలాంటి బెదురు లేకుండా చెప్పుకొచ్చింది.

అంతేకాదు, ‘‘రాహుల్ గాంధీ గురించి పూర్తిగా తెలుసుకోవాల‌ని ఉంది. మేగ‌జైన్‌లో అత‌ని ఫోటోలు చూస్తున్న‌ప్పుడు అనిపిస్తుంటుంది. అత‌డితో మాట్లాడితే ఎలా ఉంటుందా అని. నేను పూర్తిగా సినిమాలకు అంకిత‌మైన కుటుంబం నుంచి వ‌చ్చాను. అయ‌న పూర్తి రాజ‌కీయ కుటుంబానికి చెందిన వ్య‌క్తి. కాబట్టి మా మ‌ధ్య జ‌రిగే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా ఉంటుందేమో..’’ అంటూ క‌రీనా చెప్పుకొచ్చింది.

చూడాలి మరి కరీనా మాటలకి రాహుల్ గాంధీ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో, అలాగే కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్ ఏమంటాడో…?

చదవండి: మన హీరో ఇంటికొచ్చేశాడు! ఆలియా కామెంట్!