హీరోయిన్ సోనాక్షి సిన్హా అరెస్ట్‌పై స్టే ఇచ్చిన హైకోర్టు! అసలేం జరిగింది?

5:38 pm, Sat, 9 March 19
High Court to stay on Sonakshi's arrest, Newsxpressonline

అలహాబాద్: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. మొరాబాద్‌కు చెందిన ఓ ఆర్గనైజర్ గత నెలలో సోనాక్షిపై వేసిన క్రిమినల్ కేసును విచారించిన అనంతరం.. ‘‘కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి వేధింపులకు, ఇబ్బందులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే స్టే విధిస్తున్నాం..’’ అని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది.

చీటింగ్‌ కేసు…

నవంబర్ 24న సోనాక్షి సిన్హాపై చీటింగ్‌ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సెప్టెంబర్‌ 30న కార్యక్రమానికి హాజరయ్యేందుకు రూ 37 లక్షలు తీసుకున్నారని, అయితే చివరినిమిషంలో ఈవెంట్‌లో ఆమె పాల్గొనలేదని ఆరోపిస్తూ ప్రమోద్ శర్మ అనే ఆర్గనైజర్ ఈ కేసు నమోదు చేశారు.

ఈ కేసులో సోనాక్షి సహా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో అభిషేక్‌ సిన్హా, మాళవిక పంజాబి, ధుమిల్‌ ఠక్కర్‌, ఎద్గార్‌ల పేర్లు పొందుపరిచామని మొరదాబాద్‌ డీఎస్పీ గజ్‌రాజ్‌ సింగ్‌ తెలిపారు.