అల్లుఅర్జున్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో హన్సిక!

1:07 pm, Wed, 24 April 19
1
hansika-motwani

హైదరాబాద్: త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా ఈ రోజునే సెట్స్ పైకి వెళ్లింది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో టబు తండ్రి పాత్రలో జయరామ్ నటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం హన్సికను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను పోషించనున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ పాత్రను చాలా కొత్తగా ఆసక్తికరంగా డిజైన్ చేశాడని అంటున్నారు.

ఈ పాత్రలో హన్సికను కొత్తకోణంలో చూపించనున్నట్టు చెబుతున్నారు. హన్సిక కెరియర్లో ఆమె చేసిన విభిన్నమైన పాత్రల్లో ఇది ఒకటి అవుతుందని అంటున్నారు. గతంలో ‘దేశముదురు’ సినిమాలో అల్లు అర్జున్ సరసన అందాల నాయికగా అలరించిన హన్సిక, ఇప్పుడు ఆయన సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం విశేషం.