ఆకాశంలో150 డ్రోన్‌లతో బ్రహ్మాస్త్ర’ లోగో రిలీజ్!

4:02 pm, Wed, 6 March 19
brahmasthra

ముంబై: ర‌ణ‌బీర్ క‌పూర్‌, అలియా భ‌ట్ జంట‌గా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్లో అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ బాలీవుడ్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు.

హీరూ జోహార్‌, కరణ్ జోహార్, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ జ‌బాజ్‌, గులాబ్ సింగ్ త‌న్వ‌ర్ నిర్మిస్తున్న ఈ సినిమా లోగో శివరాత్రి సందర్భంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జరుగుతున్న కుంభ‌మేళాలో వినూత్నంగా లాంచ్ చేశారు చిత్రయూనిట్‌.

ఆకాశంలో లోగో లోగో …

కుంభమేళాకు వెళ్లిన చిత్ర బృందం సరికొత్తగా చిత్ర లోగోను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా రణబీర్‌, ఆలియాభట్‌లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డ్రోన్‌ల సాయంతో ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్‌ను చూపించారు.

ఈ కార్యక్రమంలో రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, అయాన్‌ ముఖర్జీ పాల్గొన్నారు. ధర్మ మూవీస్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఏ జవానీ హై దీవానీ’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ తరహాలో సినిమా లోగోని లాంచ్ చేయడం మన దేశం లో ఇదే ప్రధమం.

బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని మూడు భాగాలుగా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మొద‌టి భాగాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 25, 2019న విడుదల చేయబోతున్నారు. 

చదవండి: పూరి ఇస్మార్ట్‌ శంకర్‌ కథ అదేనా?