‘వరుణ్ ధావన్ అంటే నాకు పిచ్చి…’ అంటున్న హాట్ హీరోయిన్…

7:08 pm, Wed, 1 May 19

ముంబై: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా ద్వారా బాలీవుడ్‌ తెరకు పరిచమైన వరుణ్ ధావన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒక్క సినిమాతోనే ఎందరో అమ్మాయిల మనసు దోచేశాడు.

కేవలం నటనే కాదు.. బయట కూడా తనేంతో ఎనర్జీటిక్‌గా ఉంటాడు. అందుకే కాబోలు సాధారణ అమ్మాయిలనే కాదు ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడి కూతురిని కూడా ప్రేమలో పడేశాడు. ఏకంగా ఆమె నోటితోనే ‘వరుణ్ ధావన్ అంటే నాకు పిచ్చి ప్రేమ’ అని చెప్పించాడు.

అంతే కాదు.. ఆమెతోనే ఇప్పుడు ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’లో కలిసి నటించబోతున్నాడు. ఇంతకీ ఎవరా అందాల భామ అనుకుంటున్నారా..

అమ్మ లాగే అందాల చందమామ..

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే. అనన్య తన తల్లి భావనా పాండే లాగా చాలా అందంగా ఉంటుంది. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని త్వరలోనే బాలీవుడ్‌పై మెరవనుంది.

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’లో వరుణ్ ధావన్ సరసన నటిస్తున్న అనన్య తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ గురించి ముచ్చటించింది.

చదవండి: కాజల్ అగర్వాల్‌కు అతడంటే పిచ్చి అట! ఎవరతడు? ఏమా కథ?

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా ద్వారా పరిచయమైన వరుణ్ ధావన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఎప్పుడు చూసినా వరుణ్ ధావన్ ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడని, వరుణ్ ధావన్ అంటే తనకు పిచ్చి ప్రేమ అని.. వరుణ్‌పై తనకి ఉన్న అభిమానాన్ని చాటుకుంది.

ఇంటర్వ్యూ కంటే ముందే అనన్య వరుణ్‌పై తనకున్న ప్రేమ  గురించి ఓ ట్వీట్‌లో చెప్పేసింది. వరుణ్ ధావన్ పుట్టినరోజు సందర్భంగా అనన్య పాండే ఒక ట్వీట్ చేసింది. ‘హ్యాపీ బర్త్ డే టు యూ స్టూడెంట్.. నువ్వంటే నాకు ఎప్పటికీ ఓ క్రష్’ అంటూ విషెస్‌తో పాటు తన ప్రేమనీ వ్యక్తం చేసింది.

అనన్య అందం- వరుణ్ అభినయం.. రెండూ కలిస్తే చూడటానికి రెండు కళ్ళూ సరిపోవెమో.. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇయర్ ఎలా ఉండబోతోందో చూడాలంటే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ విడుదలయ్యే వరకూ వేచి చూడక తప్పదు.