జగన్ బయోపిక్‌పై బాలీవుడ్ దర్శకుడి ఆసక్తి…!

8:56 am, Mon, 27 May 19

హైదరాబాద్: ఏపీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. తండ్రి వైఎస్సార్ మరణం దగ్గర నుంచి పార్టీని స్థాపించడం…తర్వాత ఉప ఎన్నికల్లో గెలవడం, 2014లో ప్రతిపక్ష నేతగా ఉండి…ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించేవరకు జగన్ అనేక కష్టాల పడ్డారు.

ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ ప్రభంజనం చూసి డీపీ సతీష్ అనే పాత్రికేయుడు న్యూస్18 మీడియా సంస్థ కోసం జగన్ పై ఓ కథనం రాశారు. ‘సోనియా అవమానం, రెడ్డి ప్రతీకారం, ఆంధ్రా శాపం పేరిట రాసిన ఆ కథనం నేషనల్ మీడియాలో సంచలనం అయింది.

ఇక దీన్ని ప్రియా రమణి అనే మహిళా జర్నలిస్టు ట్వీట్ చేయగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. జగన్ జీవితం తెరకెక్కిస్తే ఓ అద్భుతమైన చిత్రం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుగులేని కథాంశంతో ఈ చిత్రం త్వరలోనే పట్టాలు ఎక్కొచ్చంటూ రీట్వీట్ చేశారు. ఇక అన్నీ సెట్ అయితే త్వరలో జగన్ బయోపిక్ వెండితెరపై చూడొచ్చు అన్నమాట..

చదవండిజగన్, కేసీఆర్ కలయిక అందుకే అనుకుంటా….