బికినీ వేసుకుంటే నీకేంటి! అడగటానికి సైఫ్ ఎవరు?

karinakapoor

ముంబై: బాలీవుడ్ కరీనా కపూర్ ఓ నెటిజన్‌పై మండిపడ్డారు. ఇటీవల కరీనా బికినీ వేసుకుని దిగిన ఫొటోను ఆమె భర్త సైఫ్ అలీఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొస్ట్ చేశాడు. ఆ ఫొటో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేశారు.

ఓ నెటిజన్ అయితే కరీనాను బికినీ ఎందుకు వేసుకోనిచ్చావ్ అంటూ సైఫ్ అలీఖాన్‌‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెట్టాడు. ఇటీవల ఓ వెబ్ సిరీస్ షోలో పాల్గొన్న కరీనా సదరు కామెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీరెందుకు క్వశ్చన్ చేస్తారు…

కరీనాకు సదరు కామెంట్‌ను అర్బాజ్ ఖాన్ కామెంట్‌ను చదివి వినిపించాడు. దీనిపై కరీనా స్పందిస్తూ.. ‘నేను బికినీ వేసుకోకుండా అడ్డుకునేందుకు సైఫ్ అలీఖాన్ ఎవరు? నన్ను బికినీ వేసుకోవద్దు అని సైఫ్ ఎప్పుడూ నన్ను అడగలేదు. అడగరు కూడా. మా ఇద్దరి బంధం అలాంటిది.

మాది బాధ్యతాయుతమైన బంధం ఉంది. నాపై సైఫ్ అలీఖాన్ ను పూర్తి నమ్మకం ఉంది. నేను బికినీ వేసుకుంటే దానికి ఓ కారణం ఉంది. నేను స్విమ్మింగ్ చేసేందుకే బికినీ వేసుకున్నాను’ అని కరీనా పేర్కొంది.