అరుదైన గౌరవం దక్కించుకున్న బాలీవుడ్ నటి దియామీర్జా

9:15 am, Sat, 11 May 19

ముంబై: తన నటనతో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ ప్రముఖ నటి దియా మీర్జా (38) అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) ప్రచారకర్తగా దియాని ఎంపిక చేసింది.

దియాతో పాటు ఇతర దేశాల నుంచి మరో అయిదుగురుని ఎంపిక చేసింది. ఇక ఇందులో చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా చీఫ్ జాక్‌ మా కూడా ఉన్నారు. అలాగే నైజీరియా, చాద్, దక్షిణాఫ్రికా, ఇరాక్‌ల నుంచి నలుగురుని ఎంపిక చేశారు.

చదవండివిజయ్ దేవరకొండ మూవీ ‘డియర్ కామ్రేడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఈ ఆరుగురితో కలిసి ఈ ఎస్‌డి‌జి బృందంలో ఉన్న వారి సంఖ్య 17కు చేరింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆటనియా గుటెరస్ తెలిపారు. ఎస్‌డి‌జి ప్రచార కార్యకర్తలుగా ఆరు దేశాలకి చెందిన ప్రముఖులని ఎంపిక చేశామని, వీరందరూ కలిసి ఆకలి, పేదరికరాన్ని రూపుమాపడం, అందరికీ ఆరోగ్య సంరక్షణ తదితర లక్ష్యాల సాధనకు కృషి చేస్తారని  తెలిపారు.

ప్రచార కార్యకర్తగా ఎంపిక కావడంపై దియా మీర్జా స్పందించారు. ఎస్‌డీజీ ప్రచారకర్తగా ఎంపికవడాన్ని గౌరవంగా భావిస్తున్నాని, శాంతి, సుస్థిర అభివృద్ధి కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రచారం చేస్తానని తెలిపింది.

చదవండికారు విమానంలో వస్తోందట.. అడ్డంగా మోసపోయిన హైదరాబాదీ!