‘ఈనాడు కథనం’పై నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

- Advertisement -

అమరావతి: పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ‘రివర్స్ టెండరింగ్’ విధానంపై ప్రముఖ దినపత్రిక ఈనాడు రాసిన కథనంపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.

‘అస్మదీయులకు అప్పగించేందుకేనా?’ అంటూ ఈనాడు రాసిన కథనం పూర్తి దురుద్దేశపూరితంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, సీఎం జగన్‌కు అయినవారు, బంధువులు ఎవరూ లేరని మంత్రి స్పష్టం చేశారు.

రివర్స్ టెండరింగ్ తర్వాత కాంట్రాక్ట్ ఎవరికి దక్కుతుందో తెలియకపోయినా ‘అస్మదీయుల కోసమేనా?’ అంటూ ఈనాడు ఓ కథనాన్ని వండివార్చిందని దుయ్యబట్టారు. ఈ కథనం వెనక ఆ పత్రిక తెరవెనక ఉద్దేశాలను బయటపెట్టిందన్నారు.

పోలవరం రివర్స్ టెండరింగ్‌ను ఈనాడు ఎందుకు వ్యతిరేకిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రానికి వందల కోట్ల రూపాయల మేర మేలు జరిగే అవకాశం ఉందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

- Advertisement -