ముంబై: శాంసంగ్ తొలిసారిగా నాలుగు కెమెరాలు కలిగిన స్మార్ట్ ఫోన్‌ని ఆవిష్కరించింది. గతంలో ట్రిపుల్(మూడు) కెమెరాలతో ‘గెలాక్సీ ఏ7’ ని విడుదల చేసి వినియోగదారులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ కంపెనీ తాజాగా క్వాడ్ (నాలుగు) కెమెరాలతో ‘గెలాక్సీ ఏ9 (2018)’ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రపంచంలోనే నాలుగు కెమెరాలతో వచ్చిన తొలి ఫోన్ ఇదేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ‘గెలాక్సీ ఏ9 (2018)’ స్మార్ట్ ఫోన్‌లో.. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డెప్త్/టెలీఫోటో సెన్సార్, పేస్ రికగ్నిషన్, క్విక్ ఛార్జ్ లాంటి సాంకేతిక ఫీచర్లు మరెన్నో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.36,990 ఉండగా, 8 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.39,990గా నిర్ణయించారు. కేవియల్ బ్లాక్, లెమనెడ్ బ్లూ, బబుల్ గమ్ పింక్ కలర్లలో లభించే ‘గెలాక్సీ ఏ9’ ఫోన్ ఈనెల 28 నుండి విక్రయానికి అందుబాటులోకి రానుంది.
గెలాక్సీ ఏ9 (2018) మరికొన్ని ఫీచర్లు…
- వెనక భాగంలో 24/10/8/5 మెగాపిక్సెల్ కెమెరాలు
- ముందు భాగంలో 24 మెగాపిక్సెల్ కెమెరా
- 6.3″ ఫుల్ హెచ్ డీ ప్లస్ (1080×2220 పిక్సల్స్)
- ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్
- 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
- 3800 ఎంఏహెచ్ బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్స్ నేటినుంచి (నవంబరు 20) ప్రారంభమయ్యాయి.