ఏపీ సీఎంగా జగన్! ముహూర్తం ఫిక్స్.. ఇదే రుజువు!!

- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద వైసీపీ ధీమాగా ఉంది. ఎంత ధీమా అంటే.. ఒకవైపు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడక ముందే ఆ పార్టీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తేదీలు కూడా ఫిక్స్ చేసేంతగా…
 
తిథి, వార, నక్షత్రాలు కూడా అన్నీ అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయం గురించి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.
చదవండి: ఏపీలో రెడ్లు అందరూ జగన్ వైపే.. టీడీపీ గెలిస్తే ఆ ఒక్కటే కారణం!: జేసీ దివాకర్ రెడ్డి

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో తాను లక్ష 20 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రఘురామకృష్ణంరాజు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.

ఇదే విషయాన్ని ఆ మద్య వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి మే 26న ప్రమాణస్వీకారం చేయనున్నారని అన్నారు. 26 నే ఎందుకంటే.. ఆరోజే ప్రమాణస్వీకారం చేయడానికి చాలా కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

తిథి,వారం, నక్షత్రం అన్నీ కలిసివచ్చేలా ఆ రోజు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. ఈ విషయంపై టీడీపీ శ్రేణులు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆలూ లేదు చూలూ లేదు అప్పుడే ఎన్నికల ఫలితాలు ఎలా చెబుతారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే పలువురు జ్యోతిష్యులు, పండితులు మీదంటే మీదే అధికారం అంటూ చెప్పుకొస్తున్నారు.

చదవండి: కడప, నెల్లూరులో వైసీపీ ప్రభంజనం! సోషల్ మీడియాలో లేటెస్ట్ సర్వే?

తాజాగా దేవనాడీ జ్యోతిష్యులు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశారు. అంతేకాదు మే 26 ప్రమాణ స్వీకారానికి శుభదినమని అంటూ ముహూర్తం సైతం పెట్టేశారు ప్రముఖ శ్రీరామనాడీ జ్యోతిష్యులు మురపాక కాళిదాసుశర్మ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న పుట్టారు.

YS Jagan Latest Updates, AP Election News, AP Political News, Newsxpressonline

ఆయనది ఆరుద్ర నక్షత్రం. 2019 మే 26వ తేదీన ధనిష్ట నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రానికి ఇది పరమమైత్రతార. ఆ రోజు ఆదివారం. సప్తమి. భాను సప్తమి అంటారు. సూర్యుడు అన్ని తారలకు అధిపతి. ప్రమాణస్వీకారం, పట్టాభిషేకానికి అలాంటి ముహూర్తాలు చాలా మంచివని పండితులు చెబుతున్నారు.

 
అయితే గతంలొ తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ఎనిమిదినెలల ముందే దేవనాడీ కాల చక్ర గ్రహగతుల బట్టి తెలపడం అనంతరం అదే రుజువు అయ్యిందని తెలిపారు. ఇప్పడు జగన్ విషయంలో కూడా ఇది ముమ్మాటికి నిజమవుతుందని..ఏపీలో వైఎస్ జ గన్ సీఎం కావడం ఖాయమని తెలిపారు.
 
చదవండి: సంచలనం: ‘పీకే’ లాస్ట్ సర్వే, ఏపీలో వైసీపీ కచ్చితంగా గెలిచే అసెంబ్లీ స్థానాలు ఇవే…
 
- Advertisement -