ఫోక్స్‌వ్యాగన్‌‌కు గట్టి ఎదురుదెబ్బ.. రూ.500 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ!

volkswagen

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌‌కు గురువారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉద్గారాలు వెలువరుస్తూ పర్యావరణానికి హానీ కలిగించినందుకు గానూ ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్జీటీ) రూ.500 కోట్ల జరిమానా విధించింది.

అంతేకాదు, ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా జమ చేయాలని ఎన్జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఫోక్స్‌వ్యాగన్‌ డీజిల్‌ కార్లలో ఉపయోగించే ఓ పరికరం కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోందని సంస్థపై ఉద్గారాల కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టింది ట్రైబ్యూనల్‌.

పర్యావరణానికి తీవ్ర హాని నిజమే…

నష్ట నివారణ చర్యల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి రూ.100 కోట్లు జమ చేయాలని ఆదేశించింది. కేసు దర్యాప్తు నిమిత్తం కాలుష్య నియంత్రణ మండలి, భారీ పరిశ్రమల శాఖ, నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, ఆటోమేటివ్‌ రీసర్చ్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

వీరి నుంచి సిఫార్సులు తీసుకున్న అనంతరం.. పర్యావరణాన్ని కలుషితం చేసినందుకుగాను ఫోక్స్‌వ్యాగన్‌కు రూ.500 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. కాగా, ఎన్‌జీటీ ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.

చదవండి: బిగ్ డీల్: రూ.1600 కోట్లకు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మకం!