జాగ్రత్త.. బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయ్.. మొత్తం 11 రోజులు!

2:10 pm, Fri, 4 October 19
banks-closed-due-to-holidays

న్యూఢిల్లీ: అసలే పండుగ సీజన్. డబ్బులు ముందుగానే డ్రా చేసుకుని ఇంట్లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ అక్టోబర్ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. ఎన్నిరోజులో తెలుసా? మొత్తం 11 రోజులు. 

శని, ఆదివారాలకు తోడు పండుగలైన దసరా, దీపావళి.. వీటికితోడు మరికొన్ని ప్రత్యేక రోజులు కూడా ఇదే నెలలో రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. 

ఇప్పటికే గాంధీ జయంతి (అక్టోబర్ 2) సెలవు ముగిసింది. ఇంకా 10 రోజులు బ్యాంకులు పనిచేయవు. పైగా ఈ సెలవులు అన్ని ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయి.

కాబట్టి నగదు అవసరాలు ఏమైనా ఉంటే ముందుగానే మేల్కొనడం శ్రేయస్కరం. ఎందుకంటే కొన్నిసార్లు ఏటీఎంలలోనూ డబ్బులు రావడం లేదు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పైగా 26, 27, 28 తేదీల్లో వరుస సెలవులు వచ్చాయి.

అక్టోబర్ నెలలో ఇవీ సెలవులు…

అక్టోబర్ 2       :  గాంధీ జయంతి
అక్టోబర్ 6       :  ఆదివారం
అక్టోబర్ 7       :  మహర్నవమి
అక్టోబర్ 8       :  దసరా
అక్టోబర్ 12     :  రెండో శనివారం
అక్టోబర్ 13     :  ఆదివారం 
అక్టోబర్ 20     :  ఆదివారం, వాల్మీకి జయంతి
అక్టోబర్ 26     :  నాలుగో శనివారం
అక్టోబర్ 27     :  దీపావళి
అక్టోబర్ 28     :  గోవర్ధన పూజ
అక్టోబర్ 29     :  భాయ్ దూజ్ (యమ విదియ)