27 నవంబర్ 2018 – మంగళవారం – దిన ఫలాలు

4:15 pm, Tue, 27 November 18
Daily Horoscope Results For 27 November 2018

daily-horoscopeగమనిక:

గ్రహాల స్థితి, వాటి గతులను దృష్టిలో పెట్టుకొని ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఇస్తున్నాం.  పైగా ఈ ఫలితాలు అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నవి.  అయితే వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా మాత్రమే ఆయా వ్యక్తుల పూర్తి కచ్చితత్వంతో కూడిన  ఫలితాలు  తెలుస్తాయి.  కాబట్టి మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ పూర్తి జాతక వివరాలను, తరుణోపాయాలను అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నాం.

 

 

 

 

1-Mesha-Rasiమేషం

ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఈ రోజు మహిళలకు కొత్త వ్యక్తుల పరిచయం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారులకు అమ్మకాలు బాగుంటాయి. ఉపాధ్యాయులకు ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. మీ పలుకుబడి ద్వారా ఇతరులు లబ్ధి పొందుతారు. రవాణా రంగంలో ఉన్నవారికి మంచి జరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి.. అయితే సన్నిహితుల సహాయంతో వాటిని అధిగమిస్తారు.

2.Vrushabha-Rasiవృషభం

పనులు నిదానంగా జరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తుల విక్రయాల్లో పునరాలోచన మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం, వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మోసపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండటం మంచిది. వ్యాపారులు తమ మాటతీరుతో కొనుగోలుదారులను ఆకట్టుకోగలుగుతారు. ప్రింటింగ్ రంగంలో ఉండేవారు తమ బాకీల వసూళ్లు కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

3.Midhuna-Rasiమిథునం

రుణ బాధలు తొలగుతాయి. సంఘంలో గౌరవం దక్కుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఇంట్లో పిల్లల మొండివైఖరి బాధిస్తుంది.. చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకు ఎదుర్కొంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వ్యాపారులకు బాగానే ఉంటుంది.. కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. పనులు సకాలంలో జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది.

4-Karkataka-Rasiకర్కాటకం

పత్రిక, ప్రైవేటు సంస్థల వారికి అనుకూల మార్పులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విశ్రాంతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. బేకరీ, స్వీటు షాపులు, పండ్ల దుకాణాల వారికి వ్యాపారం బాగుంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి సన్మాన యోగం ఉంటుంది.

5-Simha-Rasiసింహం

దూర ప్రయాణాలు తగులుతాయి. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. బంధువుల అంద లభిస్తుంది. పెట్టుబడులకు సమయం అనుకూలిస్తుంది. వ‌ృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. రుణం తీర్చేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి.

6.Kanya-Rasiకన్య

వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బంధువులతో పట్టింపులు తగ్గి సత్సంబంధాలు ఏర్పడతాయి. ముక్కు సూటి వ్యవహారం పనికిరాదు. ముఖ్యమైన పనుల్లో విజయం కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ‌ృత్తి, వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగిపోతాయి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతో ఆనందంగా గడుపుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పని ఒత్తిడి మినహా ఆశించినంతగా ఫలితం ఉండదు. మహిళలకు స్వయం సంపాదన పట్ల ఆస్తక్తి, ఆ దిశగా ప్రోత్సాహం లభిస్తాయి.

7-Tula-Rasiతుల

సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తలతో పరిచయాలు కలుగుతాయి. నూతన మిత్రుల పరిచయం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం, ఆర్థిక అభివ‌ృద్ధి ఉంటాయి. ప్రయాణాల్లో చికాకులు, అసౌకర్యం కలుగుతాయి. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ‌ృత్తిదారులకు శుభదాయకంగా ఉంటుంది. వ‌ృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ప్లీడర్లు, ప్లీడర్ గుమస్తాలకు చికాకులు కలుగుతాయి. హామీలు, చెక్కుల జారీల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.

8-Vruschika-Rasiవృశ్చికం

దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు సంతృప్తి కలుగుతుంది. ఉపాధ్యాయులకు శ్రమ అధికమవుతుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో చికాకులు, భాగస్తులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఉద్యోగులు పై అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉండి, అనుకోని అతిథులను కలుసుకుంటారు.

9-Dhanoo-Rasiధనుస్సు

సంఘంలో ఆదరణ, అరుదైన ఆహ్వానాలు ఉంటాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వీదేశీయానం ప్రయత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. కీలకమైన విషయాల్లో పట్టు సాధిస్తారు. వీలైనంత వరకు స్వయం నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో పునరాలోచన చేయండి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకోగలుగుతారు. సోదరుల నుంచి ఆస్తి లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.

10-Makara-Rasiమకరం

వృత్తి, ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశముంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి తప్పదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆకారణంగా మాట పడాల్సి వస్తుంది. వ్యాపారులు తమ కొనుగోలుదారులను ఆకట్టుకోగలుగుతారు. తేలికగా మోసపోయే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చేసిన తప్పు మళ్లీ చేయకుండా జాగ్రత్త పడండి. రిప్రజెంటేటివ్‌లకు చికాకులు తప్పవు.

11.Kumbha-Rasiకుంభం

బంధువుల రాక, పుణ్య కార్యాలయాల్లో నిమగ్నంతో ఇతర పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు బాగుంటుంది. ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. మహిళలకు అదనపు సంపాదన పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరిపోయి ఊరట కలుగుతుంది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

12-Meena-Rasiమీనం

వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల కలయికతో కొన్ని పనులు అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది. అయితే ఇతరులకు వాహనం ఇవ్వడం వల్లన ఇబ్బందులూ కలుగుతాయి. పాత మిత్రులను కలుస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా కడుపుతారు.