26 నవంబర్ 2018 – సోమవారం – దిన ఫలాలు

12:13 pm, Mon, 26 November 18
Daily Horoscope Results For 26 November 2018

daily-horoscopeగమనిక:

గ్రహాల స్థితి, వాటి గతులను దృష్టిలో పెట్టుకొని ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఇస్తున్నాం.  పైగా ఈ ఫలితాలు అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నవి.  అయితే వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా మాత్రమే ఆయా వ్యక్తుల పూర్తి కచ్చితత్వంతో కూడిన  ఫలితాలు  తెలుస్తాయి.  కాబట్టి మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ పూర్తి జాతక వివరాలను, తరుణోపాయాలను అడిగి తెలుసుకోవాలని సూచిస్తున్నాం.

 

 

 

1-Mesha-Rasiమేషం

ప్రయాణాల్లో తోటివారి పట్ల ప్రేమగా నడుచుకోండి. అది మీకూ, మీ కుటుంబానికి కూడా మంచిచేసే సూచనలున్నాయి.ఆర్థికంగా ఇబ్బందులేవీ ఉండవు. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం పై కూడా కాస్త శ్రద్ధ వహించండి. కొత్తవారు మీ కుటుంబంలో కలుస్తున్నారు.

2.Vrushabha-Rasiవృషభం

ఆధ్యాత్మికంగా గడపడానికి ఇష్టపడతారు. మంచి నిర్ణయాలు తీసుకుని చురుగ్గా సాగిపోతారు. మీకు సన్నిహితంగా ఉండేవారితో పొరపొచ్చులు వచ్చు అవకాశాలు ఉన్నాయి. విద్యకు సంభందించిన అంశాలలో మిత్రులను సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ పిల్లలపై కొద్దిగా దృష్టి సారించండి.

3.Midhuna-Rasiమిథునం

రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే వాతావరణం మీ చుట్టూ ఉండబోతుంది. వృత్తిలో తోటివారితో మర్యాదగా మసులుకోవడం మీకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఒకప్పటి ప్రేమ మళ్ళీ మీ ఛాయలకు చేరనుంది. మీరు హుందాగా నడుచుకోవాల్సిన సమయంలో మీ కుటుంబం సపోర్ట్ ముఖ్యమని భావించండి. సంభందంలేని విషయాలజోలికి వెళ్లకండి.

4-Karkataka-Rasiకర్కాటకం

జీవితం భద్రతపట్ల దృష్టి పెట్టడం వలన మీ ఆశలు నెరవేరుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబానికి మీ సహాయం అవసరం. అన్నదమ్ములతో ప్రేమపూర్వకంగా ఉండడం మీ ఆరోగ్యాన్ని కూడా కుదుటపరుస్తుంది. కొత్త వస్తువులను కొంటారు.

5-Simha-Rasiసింహం

వాహనాల విషయంలో శ్రద్ధ చాలా అవసరం. ఆర్ధికపరమైన చిన్న చిన్న చిరాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీలైనంత వరకూ కొత్తవారికి దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామికి ఇష్టంలేని పనులు చేయడానికి పూనుకోకండి. కుటుంబ కార్యక్రమాల్లో మీకు మంచిస్థానం దక్కుతుంది.  ఆహారం విషయంలో కొద్దిగా జాగ్రత్తపడండి.

6.Kanya-Rasiకన్య

కొత్త వ్యక్తులు తారసపడతారు. ఆర్దికపరంగా మాములుగానే సాగిపోతారు. పాతబాకీ వసూళ్ళు ఇంకా ఇతర కారణాలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి.  జీవిత భాగస్వామిని కొత్తాగా చూస్తారు. వారు నెరవేర్చాలనుకున్న పనుల్లో మీ భాగస్వామ్యం వారిని మరింత సంతోష పెడుతుంది. స్నేహితులను కలవడం తగ్గిస్తారు.

7-Tula-Rasiతుల

సంపాదన పై ఎక్కువగా దృష్టిసారిస్తారు. చురుకైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి కేటాయిస్తే మంచిది. భాగస్వామి తరుపు బంధువుల గురించి పట్టించుకోవడం మీకు మరింత మంచిని చేకూర్చుతుంది. పరిచయంలేని కొత్తవ్యక్తులు మీకు కీలకమైన వారవుతారు. నోటిమాట విషయంలో కాస్త జాగ్రత్త వహించండి.

8-Vruschika-Rasiవృశ్చికం

విద్యా పరమైన విషయాలకు అనుకూల వాతావరణం కనపడుతుంది. దూర ప్రయాణాలు కూడా ఉంటాయి. మూగజీవాలకు మీనుంచి సాయం అందే రోజిది. ప్రముఖులను కలవడం కూడా జరుగుతుంది. మీ వ్యక్తిత్వం ద్వారా మీకు కొత్త వ్యక్తులు పరిచయమై మీ జీవితంలోకి వస్తారు. స్నేహితులతో చిన్న చిన్న మనస్పర్ధలకు అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త వహించండి.

9-Dhanoo-Rasiధనుస్సు

మీ కుటుంబ సభ్యులు మీకు ఎంతో అండగా నిలుస్తారు. సొంత వ్యాపారం లాంటి నిర్ణయాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం మంచింది. జీవిత భాగస్వామితో ప్రయాణం చేసే అవకాశం మీలో కొత్త మార్పును తీసుకువస్తుంది. తల్లితండ్రల ఆరోగ్యం విషయంలోముందుచూపు అవసరం.

10-Makara-Rasiమకరం

మీ వృతి సంభందిత విషయాలు మిమ్మల్ని మరింత సంతోషపెడతాయి. ఆర్ధిక పరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. కొత్తవారితో ఇబ్బందులు ఎదుర్కొనే ఛాయలున్నాయి. మానసికంగా మీరు దృడంగా ఉండటానికి మీ జీవిత భాగస్వామి సాయపడతారు.  పిల్లల విషయంలో కాస్త కరుగ్గా ఉండటం జరుగుతుంది.

11.Kumbha-Rasiకుంభం

మీ తల్లితండ్రల గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆర్ధిక పరమైన విషయాల ప్రభావం మీ కుటుంబ సభ్యులపై పడే అవకాశం ఉంది. మిత్రులను కలవడం తగ్గిస్తారు. ఆరోగ్యపరమైన విషయాలనూ పట్టించుకోండి. కొన్ని అలవాట్లు మీకు దూరమై, కొన్ని అలవాట్లు కొత్తగా మీదరిచేరతాయి. అయితే అవి మంచివే. మీ అవసరాలు తీర్చడంలో మీ మిత్రుల పాత్ర ఉంటుంది.

12-Meena-Rasiమీనం

విద్య, క్రీడారంగంలోని వారికి అనుకూలంగా ఉంది.  కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకుంటారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు.  కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. తెలివిగా వాటినుంచి తప్పించుకునే మార్గాలు మీకు ముందే తెలుస్తాయి. దాపత్యం జీవితం మీకు కొత్త విషయాలు నేర్పుతుంది.